వైయస్‌ జగన్‌కు నోటీసులు అంటూ టీడీపీ మైండ్‌గేమ్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు అందాయని చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రచారం చేయిస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. పచ్చ ఛానళ్లు చేసే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, వైయస్‌ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు టీడీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌ అని, దీనిపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశామని పద్మ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. 

Back to Top