వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

నంద్యాల: ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం క్రాంతినగర్‌ చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జననేత కాన్వాయ్‌కు ఎదురు వెళ్లి మరి ఆయన్ను పూలమాలలతో స్వాగతం పలికి, రోడ్డు వెంట పూలవర్షం కురిపించారు. వైయస్‌ జగన్‌ గ్రామానికి వస్తున్నారని ఆ ఊరు వారంతా పనులు మానుకొని రోడ్డుపై వచ్చారు. అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావడంతో క్రాంతినగర్‌ కిక్కిరిసిపోయింది.

Back to Top