ముందే మేలుకొని ఉంటే ఇంతమంది చ‌నిపోయేవారా..!


విజ‌య‌వాడ‌) ఒక గ్రామంలో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతుంటే ఈ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా అని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నిల‌దీశారు. కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క వ‌ర్గంలోని చ‌ల్ల‌ప‌ల్లి మండ‌లం కొత్త మాజేరు గ్రామంలో వ‌రుస‌గా సంభ‌విస్తున్న మ‌రణాల‌కు దారి తీసిన ప‌రిస్థితుల్ని ఆయన స్వ‌యంగా ప‌రిశీలించారు. ఈ ఉద‌యం హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ చేరుకొని, అక్క‌డ నుంచి ఆయ‌న రోడ్ మార్గంలో కొత్త మాజేరు చేరుకొన్నారు. ఊరంత‌టికీ నీరు అందిస్తున్న చెరువు, క‌లుషిత ప‌రిస్థితుల్ని ప‌రిశీలించారు. కొన్నినెల‌లుగా 18 మంది దాకా మ‌ర‌ణించిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేద‌ని ఆయ‌న మండి ప‌డ్డారు.
మే నెల‌లో ఆ గ్రామంలో మొదటి మ‌ర‌ణం జ‌రిగిందని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. త‌ర‌వాత  నుంచీ ఈ ప‌రంపర కొన‌సాగుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వెలిబుచ్చారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయ‌కులు ప‌ర్య‌టించి, ప‌రిస్థితులపై అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఒక గ్రామంలో నాలుగు రోజుల్లోనే ఐదుగురు మ‌ర‌ణించార‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ యంత్రాంగంలో చ‌ల‌నం లేద‌ని ఆయ‌న అన్నారు. ఇంత జ‌రిగినా, ఆరోగ్య మంత్రి కానీ, ముఖ్య‌మంత్రి కానీ రాలేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అప్పుడే వాళ్లు వ‌చ్చి విచార‌ణ చేసి ఉంటే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చి ఉండేవ‌ని ఆయ‌న అన్నారు. వెంట‌నే ఆరోగ్య శిబిరాలు నిర్వ‌హించి ఉంటే ఇంత మంది చనిపోయి ఉండేవారు కాద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఇచ్చే మందులు ప‌నిచేయ‌టం లేద‌ని, కేవ‌లం జ్వరాల‌తోనే చ‌నిపోతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top