వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాలి: వైయ‌స్ జ‌గ‌న్‌


ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్నించే త‌త్వం పెర‌గాలి. అన్యాయాల‌పై పాల‌కుల‌ను నిల‌దీయాలి. అప్పుడే వ్య‌వ‌స్థ‌లో మార్పు వ‌స్తుంది అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. స్వాతంత్య్ర  దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం ఉద‌యం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా దేశంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం  వ‌చ్చి 70 ఏళ్లు అవుతా ఉన్నా రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను చూస్తా ఉంటే మ‌న‌కు ఇంకా స్వాతంత్య్రం  రాలేద‌నిపిస్తోంద‌న్నారు. అధికారంలో ఉన్న‌వాళ్లు తాము  ఏది చేసినా చెల్లుతుంద‌ని అనేంత కాలం మ‌న‌కు స్వాతంత్య్రం  రాన‌ట్లేన‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఏక‌మై అన్యాయాల‌పై నిల‌దీసిన‌ప్పుడే నిజ‌మైన స్వాతంత్య్రం  వ‌చ్చిన‌ట్లు అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

Back to Top