వైయస్‌ఆర్‌ లాగా పట్టుదల ఉన్న వ్యక్తి వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా పట్టుదల ఉన్న వ్యక్తి అని కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ద్రోహానికి గురికాని వారు ఒక్కరూ ఉండరన్నారు. బాబు మోసాలతో నష్టపోయిన వారికి ధైర్యం చెప్పేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా వచ్చారన్నారు. మన వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంత పట్టుదల ఉన్న వ్యక్తో..వైయస్‌ జగన్‌ అంతే కంటే పట్టుదల కలిగిన వ్యక్తి అని చెప్పారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కొండబాబు అన్నయ్య దురాక్రమణలను తిప్పికొడుదామని చెప్పారు. మనందరి కోసం కాకినాడ వచ్చిన వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top