పత్తి రైతుల సమస్యలపై పోరాటం


అనంతపురం) పత్తి రైతుల సమస్యల్ని పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావిస్తారని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రైతాంగ సమస్యల మీద కేంద్రానికి తాను లేఖ రాస్తానని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా లో వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ఆరో రోజు పంట పొలాల మీదుగా సాగింది. ఇందులో భాగంగా కదిరేపల్లి దగ్గర తోటల్ని ఆయన పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పత్తి రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చారని స్థానిక రైతులు గుర్తు చేసుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో పడుతున్న కష్టాల్ని వెళ్లబోసుకొన్నారు. రుణ మాఫీ పేరుతో చేసిన మోసం గురించి వివరించారు. పత్తి రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 
Back to Top