తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

దీపావ‌ళి.. కోటి కాంతులు నింపాలి
హైదరాబాద్‌: దీపావ‌ళి ప్ర‌తి ఇంటా  ఆనందాల కోటి కాంతులు నింపాల‌ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని వైయస్‌ జగన్‌ తన సందేశంలో అభిలాషించారు.
Back to Top