ప్ర‌జ‌ల ప‌క్షాన ధ‌ర్నా

విజ‌య‌వాడ‌: ఎల్లప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్షాన‌, ప్ర‌జ‌ల కోసం పోరాడే నాయకుడు వైఎస్ జ‌గ‌న్‌. ఈ నెల 25న‌, 26న ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌ర్నాలు చేప‌డుతున్నారు.

కృష్ణాజిల్లా కొత్త మాజేరులో విష‌జ్వ‌రాలు ప్ర‌బ‌ల‌టంతో బాధ్య‌త‌గ‌ల ప్ర‌తిప‌క్ష నేత గా వైఎస్ జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించి వాస్త‌వాలు వెలికి తీశారు. విష జ్వ‌రాల‌తో జ‌నం చ‌నిపోతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవటంపై మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. దీనికి నిర‌స‌న‌గా కృష్ణా జిల్లా ముఖ్య‌కేంద్రం మ‌చిలీ ప‌ట్నంలో ఈ నెల 25న ధ‌ర్నా చేప‌ట్ట‌నున్నారు.

మ‌రో వైపు భూ స‌మీక‌ర‌ణ పై రాజ‌ధానిరైతులు ఆందోళ‌న చెందుతున్నారు. బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌టంపై మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వమే రాక్ష‌సంగా చ‌ర్య‌ల‌కు దిగుతుండ‌టాన్ని నిర‌సిస్తున్నారు. బాధితుల ప‌క్షాన వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 26న ధ‌ర్నా చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే రైతుల‌కు వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుగా నిలిచి పోరాటాన్ని న‌డిపిస్తోంది.
Back to Top