బాణాసంచా బాధిత కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శ

బాణాసంచా పేలుడులో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. గత డిసెంబర్‌ 31న నెల్లూరు శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణాసంచా పేలుడు సంభవించి ఆరుగురు దుర్మరణం చెందారు. కాగా ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. బాణాసంచా పేలుడు ఘటన మొత్తం 17 కుటుంబాల్లో విషాదం నింపింది.

Back to Top