పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు

హైదరాబాద్ : మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్
టోర్నమెంట్‑లో విజయం సాధించిన తెలుగుతేజం పీవీ సింధును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో సింధు మరిన్ని
విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఆదివారం జరిగిన
మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-9, 21-23, 21-14 తేడాతో జపాన్‑కు చెందిన క్రీడాకారిణి మినత్సు మితానిని
ఓడించింది. మకావు ఓపెన్‑లో సింధు విజేతగా నిలవడమిది వరుసగా మూడోసారి కావడం విశేషం.

 

Back to Top