వైయ‌స్సార్సీపీ భారీ ర్యాలీ

చిత్తూరు: ప్రజలను మోసం చేసి పార్టీ మా రిన నాయకులు వెంటనే రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు సిద్ధం కావాలని చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మ0డల వైఎస్‌ఆర్ సీపీ నాయకులు సవాల్ విసిరారు. పార్టీ మా రిన నాయుకులకు గుణపాఠం చెప్పేందుకు బెరైడ్డిపల్లెలో శనివారం వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. బెరైడ్డిపల్లె చెక్‌పోస్టు కూడలి నుంచి ఇండియన్‌బ్యాంకు వరకు ర్యాలీ కొనసాగింది. ఇండియన్ బ్యాంకు వద్ద నిర్వహించిన రాస్తారోకోలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డెమా మాట్లాడారు. ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, జెడ్పీటీసీ రాధ , ఎంపీపీ విమల ఫ్యాన్ గుర్తుపై గెలిచి డబ్బుకు అమ్ముడు పోయారన్నారు. పార్టీలు మారడం సమంజసం కాదన్నారు.

వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి మాట్లాడుతూ రాత్రికి రాత్రి అవినీతి సొమ్ముతో ఎంపీపీ, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే అమ‌రనాథరెడ్డి పూర్తిగా నైతిక విలువలను కోల్పోయారన్నారు. మాజీ జెడ్పీటీసీ ఆర్. కేశవులు మాట్లాడుతూ పార్టీ మారే ముందు రాజీనామా చేయాలన్న నైతిక విలువలు పాటించకపోవడం సిగ్గు చేటన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి, జనంలోకి వచ్చి తీర్పు కోరాలని తెలిపారు. చప్పిడిపల్లె పంచాయతీ పరిధిలోని 3వ వార్డు సభ్యుడు మ‌నోహర్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Back to Top