లోకేష్‌కు కప్పం కడుతూ యరపతినేని దోపిడీ

గుంటూరు: సహజ వనరులను దోచుకుంటున్న ఘనత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌కు కప్పం కడుతూ నియోజకవర్గంలో అందినంత దండుకుంటున్నాడని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని దోపిడీ గురజాలలో జరుగుతుందన్నారు. ప్రజలకు అందాల్సిన నిధులను వెనకేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top