ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ వివేకానందరెడ్డి

 

అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నవంబర్‌ 6వ తేదీ వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమైన వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఇవాల్టికి 40వ రోజుకు చేరింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. బుధవారం ఉదయం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి కలిశారు. జననేత ఆరోగ్యంపై ఆరా తీశారు. వేలాది మందితో కలిసి వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తూ, వారి సమస్యలు తెలుసుకునేందుకు చూపుతున్న చొరవ చూసి వివేకానందరెడ్డి ఆశ్చర్యాపోయారు. ప్రతి ఒక్కరిని వైయస్‌ జగన్‌ పలకరిస్తూ, కష్టాల్లో ఉన్న వారికి భరోసా కల్పిస్తున్న తీరుకు ముగ్ధుడు అయ్యారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైయస్‌ వివేకానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top