వైయస్ వివేకా నిరవధిక దీక్ష

కడప(వైయస్ఆర్‌ జిల్లా) 07 ఆగస్టు 2013:

సమైక్యాంధ్ర డిమాండుకు మద్దతుగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి అయిన వైయస్ వివేకానందరెడ్డి బుధవారం నిరవధిక దీక్షకు కూర్చున్నారు. వైయస్ఆర్ కడప కలెక్టరేట్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో ఆయన దీక్షకు కూర్చున్నారు.  వివేకానందరెడ్డికి వైయస్  అవినాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర మద్దతుగా ఆమరణ దీక్షకు దిగిన వివేకానంద రెడ్డి, నిత్యానంద రెడ్డిలకు నగరంలోని ప్రముఖ వైద్యులు కూడా సంఘీభావం ప్రకటించారు. కొందరు విద్యార్థులు రిమ్సు(రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) కళాశాల పేరును రాయలసీమ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌గా మార్చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనాన్ని మంగళవారం ప్రశ్నించిన వివేకానంద రెడ్డి సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆమరణ దీక్షకు దిగారు. పదవీ కాంక్షతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని వివేకా విమర్శించిన సంగతి తెలిసిందే.

Back to Top