సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ విజ‌య‌మ్మ‌ నివాళులు
హైద‌రాబాద్‌:   వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు  కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైయ‌స్ఆర్‌ సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేర‌కు సోమ‌యాజులు భౌతిక‌కాయానికి విజ‌య‌మ్మ నివాళుల‌ర్పించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ..ధైర్యం చెప్పారు.  పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పుత్తా ప్ర‌తాప్‌ తదితరులు కూడా సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పించారు.
Back to Top