వైయస్‌ విజయమ్మ ఎంతో మందికి ఆదర్శం

పట్నంబజారుః దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కొనసాగిస్తూ..ఓర్పుకు మారు పేరుగా ప్రజా సేవ చేయాలనే పవిత్ర ఆశయంతో ముందుకు సాగుతున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ఎంతో మందికి ఆదర్శమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కొనియాడారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి ఆధ్వర్యంలో విజయమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేకును కట్‌చేసి పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ... నమ్మిన సిధ్ధాంతాల కోసం మాటకు కట్టుబడి ప్రజల కోసం ఎన్ని కష్టాలకు వెరుమని వైయస్సార్‌ కుటుంబాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారన్నారు. భవిష్యత్తులో విజయమ్మ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అప్పిరెడ్డి ఆకాక్షించారు. మహిళా విభాగం నగరాధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి మాట్లాడుతూ... ప్రజల మంచి కోరే మహానేత వైయస్సార్‌ కుటుంబానికి మంచే జరుగుతుందన్నారు. విజయమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్ధించారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు గంటా మరియమ్మ, వనజాక్షి, అరుణ, పి. మేరి, శారాదాలక్ష్మీ, జ్యోతి, ఆశియా, ఫాతిమా, స్వర్ణ, సుజాత, భవాని, కుసుమ, పార్వతీ, కుమారి, వసుమతి, అన్నపూర్ణ తదితరులు పాల్గోన్నారు.

Back to Top