వైయ‌స్ఆర్‌ కారణజన్ముడు

దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక కారణజన్ముడని, ఆయన చేసిన కార్యక్రమాలు, పథకాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని వైయ‌స్ఆర్‌ సతీమణి, వైయ‌స్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయ‌స్‌  విజయమ్మ అన్నారు. ఇడుపులపాయలోని  వైయ‌స్ఆర్‌  సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ వైయ‌స్ రాజశేఖరరెడ్డిగారు ఇవాళ దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆయన నిజంగా ఒక కారణజన్ముడు. ఆయన వచ్చి.. చేయాల్సిన కార్యాలన్నీ చేసి.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. వైయ‌స్ఆర్‌  ఆశయాలను కాపాడేందుకు వైయ‌స్ జగన్‌బాబు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలందరి దగ్గరకు వస్తున్నారు. ఆయనను ఆశీర్వదించండి. వైయ‌స్ జగన్‌ ప్రజలందరికీ అండగా ఉంటాడు. మీ అందరికి ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక మనవడిగా కాపాడుతాడు. వైయ‌స్ రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని మరల తెచ్చుకుందాం. వైయ‌స్‌ జగన్‌కు అండగా నిలువండి’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.


Back to Top