ఘనంగా వైయ‌స్‌ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు

అనపర్తి: వైయ‌స్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు అనపర్తిలో ఘనంగా జరిగాయి. వైయ‌స్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబాల్లో వైయ‌స్‌ఆర్ కుటుంబం ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. రాష్త్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలు పణంగా పెట్టి అనునిత్యం ప్రజా సమస్యలు కోసం పోరాడే వైయ‌స్‌ జగన్‌ను రాష్ట్రానికి అందించిన మాతృమూర్తి విజయమ్మ అని ఆయన పేర్కొన్నారు.

Back to Top