వైయస్‌ జగన్‌ సీఎం కావాల్సిందే

విశాఖ: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని పెట్ల ఉమాశంకర్‌ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పెట్ల ఉమాశంకర్‌ మాట్లాడారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజల తరఫున వైయస్‌ జగన్‌ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మొదటి నుంచి చిత్తశుద్ధితో వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని చెప్పారు. పది మాసాలుగా పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు చెప్పారన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో ట్యాక్స్‌ల భారం మోపి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. స్థానికంగా మంత్రి  అయ్యన్నపాత్రుడు ఉన్నా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అయ్యన్నపాత్రుడుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ఆకాంక్షించారు. 
Back to Top