నల్లగొండ: ’’ రాజ్యాంగం దేశ పౌరులందరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఇచ్చింది. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. చాలా మంది రాజకీయ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడలగలరు .. కానీ ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే రాజ్యాంగం ఆత్మను అర్థం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేశారు. ’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల...... గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఆనంద విద్యా మందిర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యతను వైఎస్ గుర్తించారని చెప్పారు. ఆయన ప్రభుత్వం ప్రతి ఒక్కరి హక్కులను కాపాడిందని ......రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేసిందని తెలిపారు. వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలన్నారు.