వైఎస్ షర్మిల మలివిడత పరామర్శయాత్ర...!

రాజన్న బిడ్డను చూసేందుకు బారులు తీరిన జనం..!
రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపు..!
కరీంనగర్ః దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది.  వైఎస్ షర్మిలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.  రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైఎస్ జగన్ కర్నూలు నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆకుటుంబ ప్రతినిధిగా వైఎస్ షర్మిల పరామర్శయాత్ర కొనసాగిస్తున్నారు.

అదే ఆప్యాయత, అదే ఆదరణ..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోయారు. తొలివిడత పర్యటనలో షర్మిల జిల్లాలో మూడ్రోజుల పాటు పర్యటించి 12 మందిని పరామర్శించారు. మలివిడత యాత్రలో భాగంగా గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో 8 మందిని పరామర్శించారు. శుక్రవారం  హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో మొత్తం ఏడుగురు కుటుంబాలను ఓదార్చి భరోసా కల్పించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని వారిలో ధైర్యం నింపారు. ఇవాళ మరో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. 

ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశం..!
నేడు కరీంనగర్ జిల్లా పర్యటన ముగించూకొని వైఎస్ షర్మిల మంచిర్యాల మీదుగా  ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. జిల్లాలో మూడు రోజుల పాటు మొత్తం ఆరు నియోజకవర్గాల్లో 10 కుటుంబాలను పరామర్శిస్తారు. వైఎస్ షర్మిల ఆదిలాబాద్ జిల్లా యాత్రకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 
Back to Top