మహానేతకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి

హైద‌రాబాద్‌: దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు  ఆదివారం  ఘనంగా నివాళులు అర్పించారు. ఊరూవాడ మ‌హానేత‌ను స్మ‌రించుకుంటున్నారు. వైయ‌స్ఆర్ కుటుంబ స‌భ్యులు ఇడుపుల‌పాయ‌లోని మ‌హానేత స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించ‌గా, ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ జిల్లాలోని పాద‌యాత్ర శిబిరంలో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వైయ‌స్ఆర్‌శ్రేణులు మ‌హానేత విగ్ర‌హాల‌కు పాలాభిషేకం చేసి నివాళుల‌ర్పిస్తున్నారు. వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో వివిధ సేవా కార్య‌క్ర‌మాలు, ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. 
Back to Top