వైయస్‌ రాజారెడ్డికి ఘన నివాళులు


వైయస్‌ఆర్‌ జిల్లా:  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాత స్వర్గీయ వైయస్‌ రాజారెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైయస్‌ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధి వద్ద వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల, వైయస్‌ భారతి, వైయస్‌ వివేకానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైయస్‌ మనోహర్‌రెడ్డి, వైయస్‌ కొండారెడ్డి, జార్జిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top