వైయస్ రాజారెడ్డి వర్థంతి వేడుకలు

ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి
రాజారెడ్డికి పార్టీ నేతల ఘన నివాళులు

వైయస్సార్ జిల్లాః నగర వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద వైయస్‌ రాజారెడ్డి 18వ వర్థంతి వేడుకలను ఎమ్మెల్యే అంజద్‌ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండ్రిని ఆదర్శంగా తీసుకొని.... ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో డాక్టర్‌ వృత్తిని సైతం పక్కనబెట్టి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారని కొనియాడారు. ఆంధ్రరాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన సాగించి ప్రజల గుండెల్లో  చిరస్థాయిలో నిలిచిపోయారని గుర్తు చేశారు. తండ్రి రాజారెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో వైయస్‌ఆర్, వైయస్‌ వివేకానందరెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. వర్థంతి వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైయస్‌ రాజారెడ్డికి ఘన నివాళులర్పించారు. 

ఘనంగా వైయస్‌ రాజారెడ్డి వర్థంతి
రైల్వేకోడూరు: దివంగత వైయస్‌ రాజారెడ్డి 18వ వర్థంతి వేడుకలను రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్‌ రాజారెడ్డి జిల్లా ప్రజలకు చేసిన మేలును ఆయన కొనియాడారు. నివాళులర్పించిన వారిలో పార్టీ కన్వీనర్‌ కె. బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Back to Top