వైయస్‌ పురుషోత్తం రెడ్డి కన్నుమూతవైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చిన్నాన్న‌, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వైయస్‌ పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు.   వైయస్‌ రాజారెడ్డికి పురుషోత్తంరెడ్డి సోదరుడు. వైద్యుడిగా, కంటి డాక్ట‌ర్‌గా సామాన్య ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌లందించిన పురుషోత్తం రెడ్డి మృదు స్వ‌భావి. పులివెందుల‌లో వైయ‌స్ రాజారెడ్డి ప్ర‌జా వైద్య‌శాల బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న పురుషోత్తం రెడ్డి మృతి చెంద‌డం ప‌ట్ల విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. 1991 ఉప ఎన్నికల్లో పురుషోత్తంరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Back to Top