నంద్యాల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి పెద్దనాన్న వైయస్ ప్రభుదాస్‌రెడ్డి సతీమణి వైయస్ పద్మమ్మ వైయస్సార్ జిల్లా పులివెందులలో గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. ప్రభుదాస్ దశాబ్ధాల క్రితమే కర్నూలు జిల్లా నంద్యాలకు వచ్చి స్థిరపడ్డారు. నెల రోజుల క్రితం పులివెందులకు వెళ్లిన పద్మమ్మ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం కడపలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. <strong>నేడు నంద్యాలలో అంత్యక్రియలు...</strong>వైయస్ పద్మమ్మ అంత్యక్రియలు నంద్యాలలో నిర్వహిస్తామని మనుమడు వైయస్ యువసేన రాష్ట్ర కార్యదర్శి వైయస్ సునిల్‌రెడ్డి తెలిపారు. ఆమె భౌతికాయాన్ని ఉదయం 11.30 గంటలకు బంధువులు, ఆత్మీయుల సందర్శనార్థం స్థానిక క్రిస్టియన్ అసెంబ్లీ వద్ద ఉంచారు..అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి.