మూడవ రోజు వైఎస్ జగన్ షెడ్యూల్

వరంగల్ః
 వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
 ఉపఎన్నిక ప్రచారం .... మూడోరోజు పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. 18వ
తేదీ మొత్తం 45 కి.మీ. మేర వైఎస్ జగన్ ప్రచారం కొనసాగుతుంది. జితేందర్‌నగర్, లక్ష్మినగర్, మచిలిబజార్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్, గొర్రెకుంట క్రాస్, ధర్మారం, కోనాయిమాకుల, గీసుకొండ, చింతల్ ఫ్లైఓవర్, మిల్స్‌కాలనీ పీఎస్, శంభునిపేట, ఉర్సు దర్గా, కరీమాబాద్, శివనగర్, హెడ్‌పోస్టాఫీస్‌ల మీదుగా జగన్ రోడ్‌షోను నిర్వహిస్తారు.

అక్కడి నుంచి వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ములుగురోడ్, హన్మకొండ చౌరస్తా మీదుగా సాయంత్రం హన్మకొండకు చేరుకుని హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
Back to Top