రైతు దీక్ష విరమించిన వైఎస్ జగన్


తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్ష ముగిసింది.
నిమ్మరసం తీసుకొని ఈ సాయంత్రం 4 గంటలకు ఆయన దీక్ష విరమించారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి  సంతకం పెడితే రైతుల రుణాలు
అన్నీ మాఫీ అయ్యాయని గుర్తు చేశారు. ఆ మహానేత చర్యతో తొలి సంతకం పెడితే అదో
శాసనంలాగా అమలవుతుందన్న నమ్మకం ఉండేదన్నారు.
Back to Top