12న ముస్లింలతో వైయ‌స్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనం

  
విశాఖ‌: ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన విశాఖపట్నంలో ముస్లింలు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. పాదయాత్రలో ఇప్పటికే వైయ‌స్ జగన్‌ వివిధ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. విశాఖ‌లో ఈ నెల 10వ తేదీ బ్రాహ్మ‌ణుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొంటారు. గ‌త ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలతో తీవ్రంగా మోసపోయిన వర్గాల ప్రజలంతా ఈ సమ్మేళనాల్లో వైయ‌స్ జగన్‌ను కలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. వారు మోసపోయిన తీరును, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్న జ‌న‌నేత‌.. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతూ ఆయా వర్గాల వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.  12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్‌టీఎస్‌ రోడ్డు–అరిలోవలో ఈ సమావేశం జరుగుతుంది.

Back to Top