రాష్ట్రంలో నయవంచక పాలన: వైఎస్ జగన్


అనంతపురం: రాష్ట్రంలో నయవంచక పాలన సాగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రైతు భరోసా యాత్రను జగన్ ప్రారంభించి, అనంతరం  జరిగిన బహిరంగ సభలో ఆయన  మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు నీళ్లు వస్తే అవి తన వల్లే వచ్చాయని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుటుంటున్నారని, ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

Back to Top