టీడీపీ- బీజేపీ.. ఓ బ్రహ్మాండమైన డ్రామా!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఏపీ అసెంబ్లీలో బ్రహ్మాండమైన డ్రామా ఆడుతున్నాయని అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బయటేమో రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని, సభలో మాత్రం పరస్పరం పొగుడుకుంటూ జగన్ను విమర్శిస్తారని ఆయన అన్నారు. తమ చేతుల్లో ఏమీ లేకున్నా మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఏపీకి సాయం చేయాలని కోరినట్లు ఆయన మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు.
Back to Top