మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా?

హైదరాబాద్: రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని శాసనసభా ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పది నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడుతూ సమస్యలపై చర్చలకు ప్రభుత్వం వెనకాడుతోందన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటూ మైక్ కట్ చేయటం సమంజసమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 40 రోజులు పాటు జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 17 రోజులకు కుదించటం సరికాదన్నారు. రైతులు చాలా బాధల్లో ఉన్నారన్నారు. బీఏసీ సమావేశంలో కూడా రైతు సమస్యలపై చర్చించాలని సూచించామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమయం అడగటం కూడా తప్పు చేసినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడాతూ బీఏసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై తాము చర్చకు సిద్ధమన్నారు.
Back to Top