‘రైతు భరోసా యాత్ర’ మూడోరోజు పర్యటన వివరాలు

అనతపురం: రైతు భరోసా యాత్ర మూడోరోజు పర్యటన వివరాలను జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు.  అనంతపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అనంతపురం నుంచి కూడేరు మండలం అంతరగంగకు చేరుకుంటారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు వన్నూరప్ప(58) కుటుంబాన్ని పరామర్శిస్తారు. వన్నూరప్పతో పాటు అతని భార్య నారాయణమ్మ(50) కూడా ఆత్మహత్య చేసుకుంది. గార్లదిన్నె మండలం మర్తాడుకు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న తాతిరెడ్డి(42) అనే కౌలురైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు.  అక్కడి నుండి శింగనమల నియోజకవర్గంలోని లోలూరుకు చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న గోవిందరెడ్డి(42) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
Back to Top