- వేల అడుగులు..లక్షలాది మందితో కలయిక- అడుగడుగునా బ్రహ్మరథం- ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్న ప్రజలు- అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్న వైయస్ జగన్
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర రెండు వంద కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది. వైయస్ ఆర్ జిల్లా ఇడుపుల పాయలో ఈ నెల 6వ తేదీన మొదలైన వైయస్ జగన్ పాదయాత్ర ఈ నెల 14వ తేదీ కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి వద్ద వంద కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. తాజాగా ఇవాళ డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామంలో 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ముద్దవరం గ్రామంలో రాజన్న బిడ్డపై పూలవర్షం కురిపించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
విశేష స్పందనవైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన వస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా కూడా జనం పనులు మానుకొని జననేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. దారి వెంట తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మూడురోజులు, బనగానపల్లె నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన వైయస్ జగన్ డోన్ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జననేత రాకతో గ్రామాలు జనసంద్రమవుతున్నాయి. వేలాది మంది ఆయన వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. లక్షలాది మంది ప్రతిపక్ష నేతను కలుసుకున్నారు. తమ మద్దతు మీకే అంటూ నినదిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, న్యాయవాదులు ఇలా అన్ని వర్గాల ప్రజలు, అన్నిసామాజిక వర్గాలు వైయస్ జగన్‌కు అండగా నిలుస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయామని వాపోతున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకురావాలని కోరుతున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ భరోసా ఇస్తున్నారు. మీ పిల్లలను నేనే చదివిస్తానని మాట ఇస్తున్నారు. ఎలాంటి ఆపరేషన్ అయినా సరే ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపిస్తానని హామీ ఇస్తున్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తానని కర్నూలు జిల్లాలోనే వైయస్ జగన్ హామీ ఇచ్చారు. వైయస్ జగన్ పాదయాత్ర రాష్ట్రంలో 3 వేల కిలోమీటర్లు సాగనుంది.

Read More : జగన్ రాకతో దద్ధరిల్లిన మంత్రుల అడ్డా
అన్నొస్తున్నాడని…