వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం  బడ్జెట్పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుండగానే సమయం లేదంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మైక్ కట్ చేశారు.  చర్చకు తమకు మరికొంత సమయం కేటాయించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసినా స్పీకర్ అనుమతించలేదు. మీకు కావాల్సినంత సమయం ఇవ్వలేమని స్పీకర్ తెలిపారు. బడ్జెట్పై విపక్షం చర్చ ముగిసిందంటూ ప్రకటించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.  స్పీకర్ డౌన్ డౌన్ అంటూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
Back to Top