వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చాలి

ప్రొద్దుటూరుః రాష్ట్రంలో చేతగాని దద్దమ్మల పాలన కొనసాగుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ప్రజల్లో ఎండగట్టారు. వైయస్ జగన్ వెంట నడిచేందుకు ఇక్కడకు వచ్చిన వేలాదిమందికి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ బతికున్న రోజుల్లో ప్రొద్దుటూరుకు జరిగిన అభివృద్ధి తప్పితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి అన్నదే లేదన్నారు.  రోశయ్య, కిరణ్ సర్కార్ మాదిరే బాబు సర్కార్ కూడ బంగాళాఖాతంలో కలవబోతుందన్నారు.   ఒక్క ఇళ్లు అయినా కట్టిచ్చారా, ఒక్క చుక్కనీరిచ్చారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  విషజ్వరాలతో  వందలాదిమంది చనిపోతుంటే పాలకులకు మనసు కరగడం లేదని అన్నారు. వైయస్ఆర్ ప్రొద్దుటూరుకు  పశువైద్యకళాశాల, యోగి వేమన ఇంజినీరింగ్ కాలేజీ, రింగ్ రోడ్డు, అమృతానగర్ లో పక్కా ఇళ్లు, చేనేతల కోసం 53 ఎకరాల భూమి, 350 పడకల పెద్దాసుపత్రి, రాజీవ్ నేషనల్ పార్కులాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. 

మీ ద్వారా మీ మాటగా(ప్రజల) జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అభిమానంతో, భగవంతుని ఆశీస్సులతో 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే,  ఆ ప్రభుత్వంలో ఉన్నతమైన పదవులు అవసరం లేదు. మీకు సేవ చేసి మీ మంచి ఎమ్మెల్యేగా మీ గుండెల్లో ఉంటే చాలని కోరుకుంటున్నా. మీకు సేవ చేయడం కంటే మరో పదవి నాకవసరం లేదు. 25ఏళ్లు శాసనభ్యుడిగా ఉన్న వరదరాజులురెడ్డి ఈ ఊరును సర్వనాశనం చేశాడు. నా పెళ్లప్పుడు ఏ రోడ్లున్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి. నాకు పిల్లలొచ్చారు. బండ్లు పెరిగాయి. రోడ్లు మాత్రం బాగుపడలేదు. ఊరును అందంగా చేయాలి. పండగలకు అల్లుళ్లను పిలిస్తే  దోమలున్నాయి, కరెంటు లేదు మీ ఊరికి రామంటున్నారు. మన ఊరి అల్లుళ్లను తప్పెట్లతో రప్పించే ఏర్పాటు చేస్తా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మంచి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని రాచమల్లు పిలుపునిచ్చారు . 2019లో మన ప్రభుత్వం వచ్చాక  తాగునీటి పరిష్కారం, దోమలు లేని ప్రొద్దుటూరు, చేనేతల అభివృద్ధి కోసం పాటుపడమని జననేతను కోరుతున్నా. స్వర్ణకారుల అభివృద్ధి కోసం పనిముట్లు ఇచ్చి ఆదుకోవాలిని, పక్కా ఇళ్లు కట్టించాలని కోరుతున్నా. జగన్ నాయకత్వాన్ని బలపర్చాలి. మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానంటూ రాచమల్లు ప్రసంగాన్ని ముగించారు.  
Back to Top