వైయస్ జగన్ ముఖాముఖి

ఏలూరుః  ప్రత్యేకహోదాపై ఏలూరు యువభేరి కార్యక్రమంలో వైయస్ జగన్ విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రక్షాళన చేసి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా చేసి..ఇంట్లో నాన్న (దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి) మాదిరి, నా ఫొటో పెట్టుకునేలా చేస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. యువభేరి కార్యక్రమంలో మౌనిక అనే విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం గురించి అడిగిన ప్రశ్నకు వైయస్‌ జగన్‌ సమాధానం చెప్పారు. మహానేత ప్రవేశపెట్టిన పథకాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గొప్పదన్నారు. అలాంటి పథకాన్ని మహానేత మరణాంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నీరుగార్చాయని మండిపడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే ఇబ్బందికరంగా మారిందన్నారు. తాను సీఎం అయ్యాక పేదల విద్యార్థులకు అన్నగా అండగా ఉంటానని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా, మెస్‌ బిల్లు కూడా చెల్లిస్తానని వైయస్‌ జగన్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు. 
..............................................
అన్నా..ఇలాంటి సీఎం అవసరమా?
శ్వేత, విద్యార్థినిః ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చంద్రబాబు అబద్ధం చెప్పారు. ఇది అతి పెద్ద అబద్ధపు హామీ. ఇచ్చిన హామీలు నెరవేర్చని ఇలాంటి సీఎం అవసరమా అని అన్నారు. 
  
వైయస్‌ జగన్‌: అమ్మా..మీ లాంటి వాళ్ల మాటలతోనైనా చంద్రబాబులో జ్ఞానోదయం కలిగితే మార్పు వస్తుంది.అలాగైనా అబద్ధాలు చెప్పడానికి వెనుకడుగు వేస్తారని భావిస్తున్నా.
–––––––––––
ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు
అయేషా, విద్యార్థినిః ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లుగా ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు తెస్తానని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు.

వైయస్‌ జగన్‌: చంద్రబాబు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పువ్వులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు స్పెషల్‌ విమానాల్లో తిరుగుతూ అదిగో పరిశ్రమలు, ఇదిగో ఎంవోయూలు అంటూ మభ్యపెడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయని, బాబు ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు. తనపై నమోదైన కేసుల కోసం ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. తన మంత్రులను ఉపసంహరించుకొని, కేంద్రానికి చంద్రబాబు అల్టీమేటం ఇస్తే ఏపీకి హోదా వస్తుంది. 
–––––––––––––
బాబును శిక్షించడానికి చట్టం రావాలి
అనిల్‌కుమార్, విద్యార్థిః రెండున్నరేళ్లుగా హోదా ఇస్తామని మభ్యపెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్యాకేజీ పాట పాడుతున్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. ఇలాంటి వ్యక్తిని శిక్షించడానికి చట్టం రావాలి.

–వైయస్‌ జగన్‌: అధికారం కోసం బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారు. రెండున్నరేళ్లు నిండినా ఆ పరిస్థితి లేదు. బాబుకు బుద్ధి వచ్చేలా గట్టిగా పోరాడుదాం.
–––––––––
హోదా కోసం పోరాడితే కేసులా
– భరత్, విద్యార్థిః ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఇందుకోసం పోరాడితే మొన్న ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థులపై కేసు నమోదు చేశారు. హోదాపై పోరాటం చేయడం తప్పా అన్నా..?

–వైయస్‌ జగన్‌: చంద్రబాబు ఎన్నికలకు ముందు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని, ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం హోదా ఇవ్వమంటే పోరాడాల్సిన చంద్రబాబు తప్పుకున్నారు. మనం పోరాటం చేస్తుంటే కేసులు నమోదు చేస్తున్నారు. మోడీ వస్తున్నారని తెలిసి తాను గుంటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే భగ్నం చేశారు. అందరం కలిసికట్టుగా పోరాడుదాం. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి హోదా సాధించుకుందామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top