భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజానీకంప్రభుత్వ తీరుని ఎండ గట్టిన నాయకులు
విజయవాడ: రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవటానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నా విజయవంతం అయింది. పెద్ద ఎత్తున జనం ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని నాయకులంతా ఎండ గట్టారు
జన సందోహంరైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భూ సేకరణ ను ప్రయోగిస్తూ భయపెడుతోంది. దీంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఇందులో అనేక మంది నాయకులు పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ తీరు అభ్యంతరకరంభూ సేకరణ ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇందులో నష్టపోతున్నారని ఆయన అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తోందని ఆయన వివరించారు. వైఎస్సార్ కంటే దీటుగా వైఎస్ జగన్ పరిపాలిస్తారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు పంటలు పండే భూముల్ని లాక్కొంటున్నారని ఆయన విమర్శించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతపు భూ సేకరణకు తాము వ్యతిరేకమన్నారు.చంద్రబాబుని ఫుట్ బాల్ ఆడుకోవటం ఖాయమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలన్నారు.రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని చంద్రబాబు, పత్తిపాటి పుల్లారావు, నారాయణ అంటున్నారని, ఇవన్నీ వాస్తవ విరుద్దాలని యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా అన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉంటుందని ఆయన వివరించారు.పార్లమెంటులో కూడా భూ సేకరణ చట్టానికి సవరణ తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు తామంతా నిలదీశామని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బలవంతంగా లాక్కోవటం వల్ల భవిష్యత్ లో ఆహార భద్రతకు ఇబ్బంది ఏర్పడవచ్చని ఆయన అన్నారు.