కర్నూలు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 16వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం వైయస్ జగన్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపురం క్రాస్ రోడ్డు జనంతో కిక్కిరిసిపో్యింది. జననేతకు ఘన స్వాగతం పలికి తమ సమస్యలు చెప్పుకున్నారు.