15వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


కర్నూలు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి త‌ల‌పెట్టిన 5వ రోజు ప్రజాసంకల్పయాత్ర  బుధ‌వారం ప్రారంభ‌మైంది. ఉదయం వైయ‌స్ జ‌గ‌న్ క‌ర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి పాదయాత్ర చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు జ‌న‌నేత  వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు మర్రికుంట క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్‌రోడు చేరుకుంటారు. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 4.30 గంటలకు  పెండెకల్‌ చేరుకొని.. అక్క‌డ‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 7 గంటలకు వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ బస చేస్తారు.

Read More: 


Back to Top