3 రోజుల కడప ప్రజలకు అందుబాటులో వైఎస్‌ జగన్


హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 11 న వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరుకోనున్నారు. 10న రాత్రి హైదరాబాద్ నుంచి రైలులో బయలు దేరి కడప జిల్లా ముద్దనూరు రైల్వే స్టేషన్‌లో దిగుతారు. అక్కడి నుంచి తన వాహనంలో పులివెందులకు చేరుకుంటారు. 11, 12, 13 తేదీల్లో క డప జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారు. కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోహన్ ఆస్పత్రిని వైఎస్ జగన్ 13న ప్రారంభిస్తారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఓదార్పుయాత్ర కొనసాగిస్తారు. అనంతపురం జిల్లాలోకి 14వ తేదీన ప్రవేశిస్తారు. ఈ జిల్లాలో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. 15వ తేదీతో యాత్ర ముగుస్తుంది.
Back to Top