వైఎస్ జగన్ కు వైద్యపరీక్షలు..!

గుంటూరు: ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈంసదర్భంగా ప్రత్యేకవైద్య సిబ్బంది వచ్చి వైఎస్ జగన్ కు  వైద్యపరీక్షలు నిర్వహించారు. బీపీ చెక్ చేయడంతో పాటు షుగర్ లెవల్స్, సాల్ట్ లెవెల్స్ తెలుసుకునేందుకు రక్త నమునాను సేకరించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వైద్యులు వివరాలు తెలుపుతున్నారు.
బీపీః 120/80 

షుగర్ః 91

దీక్షా ప్రాంగణం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్ వెన్నంటే ఉండి మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్ జగన్ బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే నల్లపాడురోడ్డులోని దీక్షా ప్రాంగణానికి ఆయనకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదం తొక్కుతున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top