వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

హైదరాబాద్ : విజయవాడలో కల్తీ మద్యం ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు. 

మరోవైపు, కల్తీ మద్యం  సేవించి అస్వస్థతకు గురైన బాధితులను స్థానిక  వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని స్వర్ణ బార్లో మద్యం సేవించి ఆరుగురు మృతి చెందగా..మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 
Back to Top