2,3 తేదీల్లో జననేత పర్యటన

హైదరాబాద్: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి వచ్చే నెల 2,3 తేదీల్లో వైయ‌స్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి 7వ వర్థంతి సందర్భంగా వైయ‌స్ జగన్ ఇడుపులపాయలోని వైయ‌స్సార్ ఘాట్ లో కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. 3న కడప కలెక్టరేట్ వద్ద జరిగే రైతు మహాధర్నాలో పాల్గొంటారు. 

Back to Top