కేంద్రమంత్రి జైట్లీకి వైయస్ జగన్ లేఖ

  • చేనేత కార్మికుల సమస్యలపై కేంద్రమంత్రికి లేఖ
  • జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేనేత కార్మికుల సమస్యలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. జీఎస్టీ నుంచి చేనేతలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా చేనేత కార్మికుల కష్టాలను వైయస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే గిట్టుబాటు లేక నానాటికీ కుదేలవుతున్న తమకు జీఎస్టీతో మరింత పెనుభారం పడుతుందని నేతన్నలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీఎస్టీ నుంచి చేనేతలకు మినహాయింపునిచ్చేలా కేంద్రానికి లేఖ రాస్తానని వైయస్ జగన్ నేత కార్మికులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జననేత కేంద్రానికి లేఖ రాశారు. 

అసలే అవస్థల్లో ఉన్న చేనేత రంగానికి కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ అమలు వల్ల మరింత పెద్ద దెబ్బ తగులుతుందని  వైయస్ జగన్ అన్నారు. చేనేత కార్మికులకు సంబంధించి నూలు మీద 5శాతం, బట్ట తయ్యారక కూడ జీఎస్టీ 10శాతం ఇంపోజ్ చేయడం బాధాకరమన్నారు. అసలే చేనేత బట్టలకు సరైన రేటు రాని పరిస్థితిల్లో వారిపై అదనపు భారం వేయడం తగదన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ భారం నుంచి మినహాయింపు ఇవ్వాలని వైయస్ జగన్ కోరారు. 
Back to Top