మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: మార్పు కోసం మహిళలు ధైర్యంగా ముందుకు కదలాలని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత ద్వారానే సాంఘిక, ఆర్థిక స్వావలంబన సాధ్యమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే సాధికారత సాధ్యమవుతుందని వెల్లడించారు.

Back to Top