తెలుగు ప్రజలకు వైయస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సర తొలి పండగ ... అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలి. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు.... సమాజంలోని ప్రతి ఒక్కరూ,అన్ని వర్గాల ప్రజలు ఈ ఎడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి.కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలి. పల్లెలు కళకళలాడాలి. సకల వృత్తులు పరిడవిల్లాలి.షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి,ఆనందం తీసుకురావాలని కాంక్షిస్తూ .... మరోసారి మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో -మీ వైయస్ జగన్
Back to Top