పివి సింధుకు అభినందనలు

హైదరాబాద్ః ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను కైవసం చేసుకున్న భారత నంబర్‌వన్‌ క్రీడాకారిణి పీవీ సింధును వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో సాధికారిక ఆటతీరుతో సింధు పైచేయి సాధించింది.   

సింధు కెరీర్‌లో ఇది రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌. గత ఏడాది ఆమె చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టైటిల్‌ను సాధించింది. ఓవరాల్‌గా తొమ్మిదో అంతర్జాతీయ టైటిల్‌. గతంలో సింధు మకావు ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో మూడుసార్లు... మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో రెండుసార్లు... సయ్యద్‌ మోడి ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో ఒకసారి... ఇండోనేసియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో ఒకసారి విజేతగా నిలిచింది.
Back to Top