ప్రధాని మోడీకి వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్షలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోడీకి వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ 403 స్థానాలకు గాను 325 స్థానాల్లో విజయం సాధించి నూతన అ«ధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 57 స్థానాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది. అదేవిధంగా పంజాబ్‌లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి కూడా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Back to Top