ధైర్యంగా ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు

హైదరాబాద్‌: నంద్యాలలో రూ. 200 కోట్లకు పైగా డబ్బులు పంపిణీ చేసినా, పోలీసులను, అధికారాన్ని వినియోగించినా, ఓటర్ల దగ్గరకు మనుషులను పంపించి పెన్షన్, రేషన్‌ కట్‌ చేస్తామని బెదిరించినా ధైర్యంగా వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేసిన ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన శిల్పా సోద‌రుల‌ను ఆయ‌న అభినందించారు. ప్రలోభాలు, భయాల మధ్య గట్టిగా నిలబడిన వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను వైయస్‌ జగన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై వైయస్‌ జగన్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలోకి వచ్చి రాజకీయాల్లో విలువలు అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి, అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిలకు హాట్సాప్ అన్నారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ విలువలకు కట్టుబడే ఉంటుందన్నారు. .

తాజా ఫోటోలు

Back to Top